నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వెంచేసి యున్న శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి ( స్వయంభు ) దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు, మెంబెర్స్ ప్రమాణ స్వీకారోత్సవా న్ని దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ లక్ష్మినరసింహారావు చేయించారు. తదుపరి ప్రమాణం చేసిన పాలకమండలిని దేవస్థానం అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని కోరిరి. ఉమామల్లేశ్వరస్వామి చైర్మన్ గా గొల్లపల్లి మురళి కృష్ణ, సభ్యులుగా భోగిరెడ్డి సుబ్బారావు, పులిమి సూర్యనారాయణ, సింగనపూడి మందేశ్వరరావు, అయినమిల్లి యేసు, గొలుగొండ వెంకటలక్ష్మి, తొంటపాక వెంకటలక్ష్మి, పుల్లేటికుర్తి కనకదుర్గ, కప్పల సుజాత, దేవస్థానం అర్చకులు, ఎక్స్ ఆఫీషియో మెంబెర్ బాధంపూడి సూర్యనారాయణ మూర్తిచే ఇనస్పెక్టర్ బి.లక్ష్మీ నరసింహారావు, దేవస్థానం ఈ.ఓ సోమాల శివ సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అత్తిలి వెంకట రామన్ , , అత్తిలి సోమశేఖర్, తోరం వీరన్న, ఆకుల మోహనరావు, పందిరిపల్లి చిన్న మార్కండేయలు, పులిమి ముత్యాలరావు, మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, జనసేన నాయకులు ఆకుల సుబ్బారావు, యడ్లపల్లి సత్తిబాబు, బిజేపి నాయకులు తోరం జయ శ్రీనివాస్ , ఈ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎన్నిక కాబడిన పాలకమండలి సభ్యులను అభినందించారు.


