సొసైటీ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
రైస్ మిల్లు డ్రైయర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్న ఇరగవరం మండలం ఏలేటిపాడు సొసైటీ జిల్లాలోని ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులోని డ్రైయర్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఏ సొసైటీ చేయలేని విధంగా ఏలేటిపాడు సొసైటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రైతులకు సేవలు అందిస్తోందని చెప్పారు. రైస్ మిల్లు, పెట్రోల్ బంకు, సూపర్ మార్కెట్, పాలకేంద్రం ఇలా ఎన్నో రకాల వాణిజ్య వ్యాపారాలు కొనసాగిస్తూ రైతులకు ఉపయోగపడేలా కృషి చేస్తోందని అన్నారు.విశ్వేశ్వరరెడ్డి సొసైటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ సొసైటీను విస్తరించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వపరంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. రాబోయే రోజుల్లో సైతం ప్రభుత్వపరంగా సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఏలేటిపాడు, ఐతంపూడి, పేకేరు గ్రామాలకు చెందిన రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే 2029 ఎన్నికల్లో మరోసారి కూటమి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలో తీసుకురావడానికి రైతులు కృషి చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కూటమి జెండా రెపరెపలాడించేలా సహకరించాలన్నారు. గత ఐదేళ్ల వైసిపి కాలంలో రైతులకు కనీసం సంచలు అందించలేని మాజీ మంత్రి కారుమూరి రైతులను దుర్భాషలాడారని గుర్తు చేశారు. గతంలో రైతులు తన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఉండేదని, తేమశాతం పేరుతో రెండు మూడు కిలోలు తరుగు కోసేవారని చెప్పారు. రైతులకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులు, కిరాయిలు సమయానికి రాని పరిస్థితులు చూశారని చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన వంతు సహకారం అందించేందుకు అందుబాటులో ఉంటానని అనలేదు రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


