కూటమి ప్రభుత్వంలో రోడ్లు నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత

రూ. 1.40 కోట్లు వ్యయంతో రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణం

సీసీ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తణుకు రైల్వే స్టేషన్ రోడ్డును శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేపట్టామని చెప్పారు. మంగళవారం తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులో జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రైల్వే స్టేషన్, హాస్పిటల్స్ ఉండడంతో నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటోందని ఈ క్రమంలో రైల్వే స్టేషన్ నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు శిధిలావస్థకు చేరడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సుమారు 21 అడుగుల వెడల్పు 10 అంగుళాల ఎత్తులో ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. తణుకు పట్టణానికి మంజూరైన రూ.3 కోట్ల నిధులలో సుమారు రూ. 1.40 కోట్లు నిధులు ఈ రోడ్డు, నిర్మాణానికి కేటాయించామన్నారు. దీంతోపాటు ఎక్సెల్ రోడ్డు నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రపతి రోడ్డుకు ప్రత్యామ్నాయంగా కప్పల వెంకన్న సెంటర్ నుంచి స్త్రీ సమాజం రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా నేరుగా జాతీయ రహదారి పైకి వెళ్లేలా రోడ్లు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రావడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link