ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాలలో సి.పి.ఆర్ అవగాహన సదస్సు

స్థానిక ఎస్.కె.ఎస్.డి. మహిళా పి.జి కళాశాల (అటానమన్) తణుకులో – రోటరీ క్లబ్’- తణుకు వారి అధ్వర్యంలో సి.పి.ఆర్. అవగాహాన సదస్సును ఏర్పాటు చేశారు. కళాశాల ఫ్రీన్సిపాల్ కెప్టెన్ యు.లక్ష్మి సుందరీ బాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

రోటరీక్లబ్ – తణుకు ప్రెసిడెంట్ డా ॥ కలగర వెంకట కృష్ట మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా మెగా వైద్య శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా సి.పి.ఆర్ వంటివి నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తున్నామని తెలియ జేశారు.

కార్డియో పలవరీ రిససిటేషన్ ” అవగాహన సదస్సు ముఖ్య అతిధిగా విచ్ఛేసిన డా|| కె. ప్రదీప్ ఇమ్మానియేలు మాట్లాడుతూ కార్డియాక్ అరెస్ట్ జిరిగిన మొదటి కొన్ని నిముషాల్లో CPR అందిస్తే బాధితుడు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దీనినే “గోల్టన్ మినిట్స్ అంటారని, గుండె తిరిగి కొట్టుకోవడం మొదలయ్యేవరకు లేదా నిపుణులైన వైద్య సహాయం అందేవరకు CPR చేయాలని ప్రాక్టికల్ రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి, శ్రీ జి.సుధాకర్ సెక్రటరీ రోటరిక్లబ్, శ్రీమతి సౌచీ ప్రసన్న, వై. ఐశ్వర్య, అద్యాపకులు శ్రీ.ఎ. దివేష్ బాబు NCC కోఆర్డినేటర్ K.V. శ్యామల దేవి, పి.హెచ్. రమేష్ NCC కేర్ టేకర్ ఎ. దీప్తి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. హెచ్. పామబిందు విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link