పుట్టపర్తికి విచ్చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు
పుట్టపర్తి: పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబ శతజయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించే క్రతువులో మంత్రి కందుల దుర్గేష్ భాగస్వామి అయ్యారు. ఏపీ ప్రభుత్వం సత్యసాయి శతజయంతి ఉత్సవాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రి కందుల దుర్గేష్ సభ్యుడు కావడంతో పరిశీలన బాధ్యతలు చేపట్టి భక్తులకు అందుతున్న ఏర్పాట్లను సహచర మంత్రులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 23వ తేదీ వరకు పుట్టపర్తిలోనే ఉండి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించనున్నారు. మానవాళిలో అధ్యాత్మికత, శాంతి, సమాజసేను పెంపొందించేందుకు శ్రీ సత్యసాయి చేసిన ప్రయత్నాలను భావితరాలకు అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
ఈ సందర్భంగా పుట్టపర్తి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు శాంతిభవన్ లో సహచర మంత్రులు ఎస్. సవిత, బీసీ జనార్థన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్ లు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులంతా కలిసి సత్యసాయిబాబ శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి వేడుకల ప్రత్యేకతను వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంత్రి కందుల దుర్గేష్ ను ఆప్యాయంగా పలకరించి సంభాషించుకున్నారు. అదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంత్రి దుర్గేష్ ను కోరి వినతి పత్రం అందించారు. దారిలో వెళుతుండగా పెదపల్లి గ్రామంలో అయ్యప్ప భక్తులు మంత్రి దుర్గేష్ ను కలిసి ఘనంగా సత్కరించారు.


