కుటుంబ సమేతంగా స్వామి వార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే
కార్తీక మాసం పురస్కరించుకుని పెనుమంట్ర మండలంలో వేంచేసిన నత్తా రామేశ్వరం, జుత్తిగ గ్రామాల్లో ప్రసిద్ధిగాంచిన శివాలయాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసితో పాటు కుమారుడు నిఖిల్ రత్న కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలోని ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. వారి వెంట పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.


