వివేకానంద గ్లోబల్ హైస్కూల్లో బాలల దినోత్సవం

వివేకానంద గ్లోబల్ హైస్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 300 మంది విద్యార్థులు పాల్గొనగా 22 మంది విజేతలకు మానవతా జిల్లా కమిటీ వారిచే స్పాన్సర్ చేయబడిన ప్రోత్సాహక బహుమతులను ఎస్ కే ఎస్ డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అధినేత శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది. ఆల్రౌండర్ గా గెలుపొందిన జి. రంజిత్ కుమార్ కి మానవత వారు ట్రోఫీనీ అందజేశారు. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఈ పోటీలు మా పాఠశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందని మా పాఠశాలలో చదువుతోపాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ముఖ్య వక్తగా పాల్గొన్న మానవతా రాష్ట్ర కన్వీనర్ మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు కూడా అవసరమని అప్పుడే వారి శారీరిక మానసిక ఆరోగ్యము పెరుగుతుందని అన్నారు. మంచి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం బావుంది చదువు బాగా వస్తుందని మంచి పౌరులుగా తయారవుతారని అన్నారు.
తణుకు మండల చైర్మన్ కడించర్ల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ ఈ పాఠశాలలో సి.బి.ఎస్.ఈ. బోధన ద్వారా అనేకమంది విద్యార్థులు ఉన్నత చదువులలో ముందు ఉంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్స్ బోయపాటి రామలక్ష్మి, కటారి శారదా దేవి, ఆలపాటి సుబ్బారావు, దాట్ల సత్యనారాయణ రాజు, జి. లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link