తణుకు బ్యాంక్ కాలనీ నందు ఉన్న పురుషుల శాఖ గ్రంధాలయం నందు జాతీయ గ్రంథాలయాల వారోత్సవములు ప్రారంభోత్సవం జరిగినది
ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం జండా ఆవిష్కరణ చేయగా
వావిలాల సరళదేవి గ్రంథాలయ వ్యవస్థాపకులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు.
అనంతరం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ ను అందరితో చేయించారు అనంతరం సభా కార్యక్రమాల ప్రారంభమయ్యాయి.
సరళ దేవి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సభకు తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి పాల్గొన్న ప్రతి ఒక్కరు పుష్పాలతో ఆయనకు నివాళులర్పించారు
అనంతరం ముఖ్య అతిథిగా ప్రముఖ వక్త శ్రీ డి వి వి ఎస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవం పురస్కరించుకుని పండిత జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాలను, బాలలపై ఆయనకున్న ప్రేమను, దేశభక్తిని, ఆయన జైలు జీవితాన్ని, జైల్లో ఆయన కూతురైన ఇందిరా గాంధీకి రాసిన ఉత్తరాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించి తెలియజేశారు.
అతిధిగా పాల్గొన్న కొవ్వెలి ఆంజనేయ శర్మ గ్రంథాలయాల విశిష్టత గురించి వివరించారు. అనంతరం మరొక అతిథిగా పాల్గొన్న సుబ్రహ్మణ్యం నేటి బాలలు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలని సెల్ ఫోన్ యొక్క అనర్ధాలను వివరించారు. మరొక అతిధి అయిన సూరంపూడి కామేష్, గ్రంథాలయాల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వందన సమర్పణ కౌర వెంకటేశ్వరరావు చేయగా, అనంతరం సరళదేవి, కౌర వెంకటేశ్వరరావు, అతిథులైన వర్మ, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కొవ్విలి ఆంజనేయ శర్మలను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీన్ గుత్తికొండ కృష్ణారావు, జి.స్రవంతి, సంకు మనోరమ, చీకటి శ్రీనివాస్, వావిలాల పవన్ కుమార్, కె.వి.ఆంజనేయులు, కె.శ్యామల, బి జ్యోతి, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


