మెడికల్ కళాశాలల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు, నిరసన ర్యాలీ తధనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోణాల భీమారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా మండల, పట్టణ, గ్రామ, వార్డు వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ విభాగాల నాయకులు అలాగే సీపీఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


