“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ మంచి విజయాన్ని సాధిస్తుంది

– హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి

విశాఖపట్నం: నవంబర్ 12 (కోస్టల్ న్యూస్)

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు” ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ లో ఈ చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా నగరంలో ని ఒక హోటల్లో జరిగిన సమావేశంలో
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ ఈ స్క్రిప్ట్ వినగానే ఇప్పుడున్న సమాజంలో చెప్పాల్సిన కథ ఇది అనిపించింది. మనకు ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా పెరిగాయి. ఇన్ ఫెర్టిలిటీ ఇష్యూ అంటే అమ్మాయిలనే అనేవారు. అమ్మాయిలోనే లోపం ఉంది, పిల్లలు పుట్టడం లేదంటే మరో పెళ్లి చేద్దామనే అభిప్రాయానికి వచ్చేవారు. కానీ ఫస్ట్ టైమ్ మేల్ ఫెర్టిలిటీ ఇష్యూను ఈ సినిమాలో చూపించడం కొత్తగా అనిపించింది. ఈ సమస్య గురించి మాట్లాడేందుకు అందరూ ఇబ్బంది పడతారు. మిగతా వాళ్లు చులకనగా చూస్తారా, నవ్వుతారా అని సందేహిస్తారు. అలాంటి సీరియస్ పాయింట్ చుట్టూ ఫన్, ఎంటర్ టైన్ మెంట్ చేర్చి ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా అందరూ మాట్లాడుకునేలా ఒక ప్రయత్నం చేశాం. సినిమా రిలీజ్ అయ్యాక ఈ సమస్య మీద అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాం. ఈ చిత్రంలో కల్యాణి పాత్రలో నేను నటించగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి కి థ్యాంక్స్. అలాగే ఈ ప్రాజెక్ట్ ను ఎక్కడా తగ్గకుండా నిర్మించి రిలీజ్ కు తీసుకొస్తున్నారు మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్, హరి ప్రసాద్, మా హీరో విక్రాంత్ డెడికేటెడ్ యాక్టర్. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు రావాలి. మా కో స్టార్స్ అందరూ ఆకట్టుకుంటారు. మా మూవీ ట్రైలర్ ఇష్టపడిన వారు సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ కెరీర్ పరంగా సాఫ్ట్ వేర్ లో ఉన్నా, నాకు మూవీస్ అంటే ప్యాషన్ ఉండేది. గతంలో ఒక సినిమా చేశా అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని థియేటర్ ద్వారా నటనను మెరుగుపర్చుకున్నా. ఒకరోజు శ్రీధర్ ని కలిసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన ఈ స్క్రిప్ట్ పంపించారు. నేను రెగ్యులర్ ఫార్మేట్ మూవీస్ చేస్తే ఎవరికీ నచ్చదు. డిఫరెంట్ మూవీస్ చేయాలి, అందరికీ రిలేట్ అయ్యేలా ఉండాలి అనుకున్నా. “సంతాన ప్రాప్తిరస్తు” కథ చదివాక నాకు అదే ఫీల్ కలిగింది. ఒక సెన్సిటివ్ ఇష్యూను తీసుకుని దానికి ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసిన చిత్రమిది. మూవీ చివరలో మంచి ఎమోషన్ తో, మెసేజ్ తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు. ఈ మూవీలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రోల్ చేశాను. ప్రతి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఈ క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు. ఇప్పుడున్న కపుల్స్ లో సంతాన సమస్య ఎక్కువగా ఉంది. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు. మంచి మూవీస్ చేసి పేరు తెచ్చుకున్న చాందినీ మా చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. వెన్నెల కిషోర్, అభినవ్, తరుణ్ భాస్కర్ ఇలా కామెడీ బాగా పండించగల వారితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. నేను ఈ మూవీ చేసే అవకాశం కల్పించిన శ్రీధర్ కి, హరిప్రసాద్ కి, సంజీవ్ రెడ్డి కి థ్యాంక్స్ మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ మూవీ బెటర్ గా వచ్చేందుకు ఎఫర్ట్స్ పెట్టారు. మనం బలంగా నమ్మితే లైఫ్ లో ఏదైనా సాధించగలం. సినిమా పట్ల నా ప్యాషన్ కూడా సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నా అన్నారు.

Scroll to Top
Share via
Copy link