స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల యుజీ అండ్ పిజీ (అటానమస్) జాతీయ సేవా పథకం గోటేరు గ్రామములో నిర్వహిస్తున్న ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరంలో 2వ రోజు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించినారు. సచివాలయం, అంగన్వాడీ మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరచి స్వచ్ఛత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేశారు.
స్వచ్ఛాంధ్రా కార్పోరేషన్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీ రోహిత్ విద్యానంద్ పరిసరాలు పరిశుభ్రత మరియు ప్రాముఖ్యతపై ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్స్, సి.హెచ్. రమేష్ బాబు, శ్రీమతి కె.వి. శ్యామలదేవి ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.


