తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన టీవీ సినీ ఆర్టిస్ట్ వై.టి. మూర్తి ధన్వంతరి అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అవార్డును జూనియర్ సివిల్ జడ్జ్ నాదెండ్ల రామచంద్ర రావు నుంచి అందుకున్నట్లు మూర్తి తెలిపారు. ఈ అవార్డును ఈటీవీ సీరియల్ రంగులరాట్నంలో అంజి పాత్రలో నటిస్తున్న మూర్తికి ఇవ్వడం ఆనందంగా ఉందని ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వర్తనపల్లి రామకృష్ణ తెలియజేశారు. మూర్తికి అవార్డు రావడం పట్ల తోటి కళాకారులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.


