ఐదేళ్లలో జగన్ మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన

ఆరు నెలల్లో టిడ్కో ఇల్లు పూర్తి చేసి అందించేందుకు చర్యలు

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కనీసం ఎక్కడా అభివృద్ధి లేకుండా భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని సైతం ఆరకొరగా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఏ ఆశయంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి రాష్ట్ర ప్రజలు తీసుకువచ్చారో అదే ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్న ఘనత కూటమీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో నిత్యావసర వస్తువులను ధరలను పెంచకపోగా జీఎస్టీ తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజల కుటుంబాల్లో ఏడాదికి రూ. 15 వేలు ఆదా అవుతుందని అంచనా వేయడం జరిగిందని చెప్పారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోగా పెట్టుబడులు ఏమీ లేక ఉద్యోగాలు సైతం ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని 7 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఉద్యోగాలకు ఇబ్బందులేకుండా కూటమి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా 111 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం ఉండి రూ. 2.50 లక్షలతో ఇల్లు కట్టుకునేందుకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రామ్కుమార్ తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link