వందేమాతరం 150 వ వార్షికోత్సవ వేడుకలు

శ్రీమతి కొండేపాటి సరోజనీదేవి మహిళా కళాశాల (డిగ్రీ & పీజి) అటానమస్, తణుకు

స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల డిగ్రీ అండ్ పిజీ (అటానమస్)లో చరిత్ర మరియు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 సం॥ములు పూర్తి చేసుకొన్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ విచ్చేసి మాట్లాడుతూ బంకించంద్రచటర్జీ ఈ గీతాన్ని 1875 నవంబరు 7వ తారీఖున వ్రాశారని, ఈరోజుకి 150 సం॥ములు పూర్తి అయినది అని, భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతం ఉద్యమ గీతంగా నిలిచిందని, 1896 వ సం॥లో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారిగా ఆలపించారని, వందేమాతరం గీతం కేవలం ఒక పాటగా కాకుండా భారతదేశపు చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వంగా నిలిచిందని, భారతీయులలో దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ. నాగన్న, చరిత్ర అధ్యాపకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర నినాదం మరియు భారతీయ స్వాతంత్య్ర సమరయోధులకు ప్రధాన నినాధంగా నిలిచిందని ఈ నినాదం లక్షలాది మందిలో పోరాట స్ఫూర్తిని రగిలిచిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి సి. హెచ్. నాగశ్రీ, పొలిటికల్ అధ్యాపకురాలు ఎన్.సి.సి క్యాడెట్స్, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link