ఇటీవల మోంత తుఫాన్ వల్ల పంట నష్టం జరిగినటువంటి రైతుల జాబితాను క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనలు మేరా 33 శాతం కంటే ఎక్కువ నష్టం వాటిల్లినటువంటి రైతుల వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియ పూర్తయిందని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు తెలిపారు. మండలంలోని 15 గ్రామాలలో 1133.80 హెక్టార్లలో 1784 మంది రైతులకు చెందిన వరి పంట దెబ్బతిన్నట్లుగా నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఇప్పటికే వరి కోతలు మండలంలో 10 హెక్టార్లు పూర్తయినట్లుగా రైతులు వారి యొక్క పంటను తప్పనిసరిగా ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు లోబడి ఆరబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని విక్రయించిన 24 గంటల లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమచేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రైతులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తొందరపడి మధ్యవర్తులకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ధాన్యం కొనుగోలు సమయంలో కూడా ఏ రైతుధాన్యం అయితే 17% కంటే తేమ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వారికి రైతు సేవాకేంద్రాల ద్వారా గోనే సంచులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే దాల్వా సీజన్ కు సంబంధించి పొలం పిలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కాల్దారి, సత్యవాడ గ్రామాలలో నిర్వహించి రైతులకు ధాన్యం కొనుగోలు, రబీ సీజన్ కు సమాయత్తం పై అవగాహన కల్పించినట్లు తెలిపారు.


