జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేతలిలో ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త, హ్యూమన్ కంప్యూటర్ గా పిలవబడే శకుంతలా దేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శకుంతల దేవి చిత్రపటానికి పూలమాల తో నివాళులర్పించి శకుంతల దేవి బహుముఖ ప్రజ్ఞావంతురాలని, 13 అంకెల సంఖ్యను 13 అంకెల సంఖ్యతో గుణించగా వచ్చే లబ్దాన్ని 28 సెకండ్లలో చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారని, ఆమె పేద కుటుంబంలో బెంగళూరులో 1929 నవంబర్ 4 న జన్మించారని, గణిత శాస్త్రంలోనే కాక ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలలో కూడా ప్రవీణురాలని, గణితం నిత్యజీవితంలో ప్రతి వ్యక్తికి అవసరమని, విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలంటే గణిత పరిజ్ఞానం తప్పనిసరిగా కావాలని హితవు పలికారు.
గణిత ఉపాధ్యాయులు కర్రి పుల్లారెడ్డి, జె.రాజకుమారి శకుంతల దేవి గొప్పతనం వివరించారు.
ఈ కార్యక్రమంలో మారుతి రామ్, వెంకటేశ్వరరావు, గంగాభవాని, గోపాల రెడ్డి, రామకృష్ణ, మాధవి లక్ష్మి, బుచ్చియ్య, పుష్పవల్లి, పావని, సూర్య చంద్ర కుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


