ఆదరణ 3.0 పథకం ద్వారా టైలర్స్ అత్యాధునిక (జూకి) కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలి

ఆదరణ 3.0 పథకం ద్వారా టైలర్స్ కు అత్యాఆధునిక (జూకి) కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలని వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టైలర్స్ వర్కర్ సంఘo సమావేశం అధ్యక్షులు మల్లేశ్వరపు నాగరాజు అధ్యక్షతన స్థానిక పార్వతిదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిప్రభుత్వం అధికారంలోకి వస్తే చేతివృత్తిదారులకు గతంలో మాదిరిగా ఆదరణ పథకం అమలుచేసి అత్యాధునిక పనిముట్లు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించిందని వీరభద్రరావు గుర్తుచేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇటీవల 3.0 పథకంలో చేతివృత్తిదారులకు పనిముట్లు అందజేయాలని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువ మంది టైలర్స్ జూకి వంటి కుట్టుమిషన్లు వినియోగిస్తున్నారని అయితే వాటిని కొనుగోలు చేయాలంటే దీని ధర 25 వేల నుండి 30 వేల వరకు ఉండడం వలన వీటిని కొనుగోలు చేసే ఆర్థికస్తోమత లేక కొంతమంది అధిక వడ్డీలకు అప్పులుచేసి కొనుగోలు చేస్తున్నారని మరికొంతమంది అప్పులుచేసి కొనుగోలు చేయలేక సాధారణ కుట్టుమిషన్ మాత్రమే వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి టైలర్స్ కు సంబంధించి సాధారణ కుట్టుమిషన్లు కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి టైలర్స్ కి ఉచితంగా జూకి కుట్టు మిషన్ అందజేయడంతో పాటు 50 సంవత్సరాలు నిండిన ప్రతిటైలర్స్ కు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసా వెంకటేశ్వర్రావు, కుడకా వీరభద్రరావు, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, రుద్రాక్షల శ్రీనివాసు, కరేళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link