స్నేహాలు, బంధుత్వాలకు పునాది వనసమారాధనలు

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి

స్నేహాలు, బంధుత్వాలకు పునాది వేసి తద్వారా మంచి వాతావరణాన్ని పెంచే విధంగా కార్తీక వన సమారాధనలు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి అన్నారు. మంగళవారం తణుకు మండలం కొమరవరం వాసవి నగర్ లో కొల్లూరి లక్ష్మీనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్యవైశ్య కార్తీక వన సమారాధనతో పాటు తణుకు పట్టణంలోని చరణ్ టైలర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధనలు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకచోట చేరి ఆట పాటలతో ఉల్లాసంగా గడపడం ద్వారా బంధాలు మరింత బలపడతాయని చెప్పారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ఆర్యవైశ్యులతో ప్రారంభించి అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఈ సందర్భంగా కృష్ణ తులసి గుర్తు చేశారు.

Scroll to Top
Share via
Copy link