నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏఆర్ కానిస్టేబుల్స్, వారి కుటుంబ సభ్యులు మంగళవారం తణుకులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2009 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు తాము ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 16 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఈ మేరకు తణుకు శివారులోని మురికివాడల్లో పేదలకు నిత్యవసరాలతో పాటు బియ్యం, నగదు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యావసరాలు, రూ. 1000 చొప్పున నగదును రెండు కుటుంబాలకు అందజేశారు. తమ బ్యాచ్ తరపున ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ధ్యేయంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి ఎన్జీవో వి.ఆశాజ్యోతి, సచివాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


