బాలికల చదువుతోనే సమాజం అభివృద్ధి

ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచనలతో మురికివాడల్లో అవగాహన


ప్రతి బాలిక చదువుకోవడం ద్వారా ఆ కుటుంబంతోపాటు సమాజం అభివృద్ధి చెందుతుందనే ధ్యేయంతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మురికివాడల్లోని తల్లిదండ్రులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తణుకు పట్టణ శివారులోని డంపింగ్‌ యార్డు వద్ద గత కొన్నేళ్లుగా తాత్కాలిక నివాసాలు వద్ద డీవీఎంసీ ఎన్జీవో వి.ఆశాజ్యోతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి మాట్లాడుతూ మురికివాడల్లో నివాసం ఉంటూ తమ పిల్లలను చదువుకు దూరంగా ఉంచడం వల్ల వారు అభివృద్ధి చెందలేకపోతున్నారని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లల చదువుపై దృష్టి సారించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. ముఖ్యంగా కుటుంబ నియంత్రణపై వారికి అవగాహన కల్పించారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలతోనే సంతానం నిలిపివేయాలని వారికి సూచించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో త్వరలోనే ప్రతిఒక్కరికి ఆధార్‌కార్డు అందజేసి తద్వారా వారిని ప్రభుత్వం కల్పించే నివాసాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యశిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.భూషణం, అడ్మిన్‌ సెక్రటరీ బి.రాజేష్, సచివాల సిబ్బంది ఇ.మదన్‌మోహన్, పి.మహాశ్రీ, కనకదుర్గ, వి.కిశోర్‌కుమార్, డి.శాంతిసుధ, ఎం.సునీత తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link