బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0

  • బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయింపు
  • ప్రతి కుటుంబం నుండి ఒకరు ఎంటర్ ప్రెన్యూర్ తయారు కావాలి
  • బీసీల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం -బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత

బీసీలకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతుంది కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, కుల సంఘాలు, డైరెక్టర్లతో ఆదరణ 3.0 పథకం అమలుపై మూడు రోజుల పాటు నిర్వహించే వర్క్ షాప్ ను మంత్రి సవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ బీసీలు సమిష్టిగా కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు బీసీలకు పెద్దపీట వేస్తూ వారికి అండగా ఉంటున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించారన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ చేశామన్నారు. బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందుండాలని వారికి నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామన్నారు. గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని, ఆయన స్ఫూర్తితో మళ్లీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.

ఆదరణ 3.0 పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేలా చైర్మన్లు, డైరెక్టర్లు, కుల సంఘ పెద్దలతో వర్క్ షాప్ నిర్వహించి చర్చించి వారి అభిప్రాయాలు సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకొని పారదర్శక అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీ కులానికి చెందిన కుటుంబ నుండి ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆదరణ 3.0 పథకానికి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేశామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేయడంతో వారు ఎంతో నష్టపోయారన్నారు. బీసీలు వారి కాళ్లపై వారు నిలబడాలన్న ఉద్దేశంతో ఆదరణ 3.0 అమలు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలలో ఎక్కువగా లబ్ధి పొందేది బీసీలే అని, మెగా డీఎస్సీలో బీసీ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఎంపిక కాబడ్డారని మంత్రి గుర్తు చేశారు. ఆదరణ 3.0 పథక అమలుపై కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు సలహాలు సూచనలను ప్రభుత్వానికి నివేదించి పథకాన్ని పారదర్శకంగా ఎటువంటి లోటు పాట్లు లేకుండా అమలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత అన్నారు.

విశ్వ విజేత మహిళా క్రికెట్ టీమ్ కు అభినందనలు…

ప్రపంచ మహిళా క్రికెట్లో భారత్ ను విశ్వ విజేతగా నిలిపిన ఇండియా టీమ్ సభ్యులకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. దేశ ప్రగతిని, గౌరవాన్ని పెంచి మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి యువగళం నారా లోకేష్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మహిళా ప్రపంచ క్రికెట్ ను ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మనం విశ్వవిజేతగా నిలవాలని నారా లోకేష్ ఆకాంక్షించారన్నారు.

అవార్డులు అందుకోనున్న భువనమ్మకు అభినందనలు..

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కూతురుగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్యగా, యువగళం నారా లోకేష్ తల్లిగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న నారా భువనేశ్వరి లండన్ లో రెండు అవార్డులు అందుకోనున్న సందర్భంగా మంత్రి సవిత అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లోనూ, హెరిటేజ్ సంస్థలో ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నారా భువనేశ్వరి విశిష్ట సేవలు అందిస్తున్నారని మంత్రి సవిత అన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ ఉన్నారు.

Scroll to Top
Share via
Copy link