మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను ఎంతగానో కలిసి వేసిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తణుకులో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కొద్దిసేపు మౌనం పాటించారు. ఆలయం ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటన పట్ల తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ కు ఆదేశించిందని చెప్పారు. అప్పటికప్పుడు మంత్రి నారా లోకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టారని అన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.


