త్వరలో కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయం
తణుకు ఏఎంసి చైర్మన్ కొండేటి శివ వ్యాఖ్యలు
లిక్కర్ కుంభకోణంలో మరింత మంది గజదొంగలు బయటకు వస్తున్నారని తణుకు ఏఎంసి చైర్మన్ కొండేటి శివ వ్యాఖ్యనించారు. జోగి రమేష్ అరెస్టు పట్ల మాజీ మంత్రి కారుమూరి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండను తవ్వి ఎలకను పట్టుకున్నారంటూ మాజీ మంత్రి కారుమూరి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ కుంభకోణంలో మరింతమంది గజదొంగలు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. త్వరలోనే కారుమూరి సైతం జైలుకు వెళతారని పేర్కొన్నారు. మొంథ తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో మూడు రోజులపాటు రాత్రి పగలు అధికారులు, నాయకులను సమన్వయం చేసి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మాజీ మంత్రి కారుమూరి ఇప్పుడు వచ్చి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


