మోంథా తుఫాన్ కారణంగా తణుకు రూరల్ మండలం దువ్వ, ముద్దాపురం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం వైసిపి నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపొయిన రైతులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రుద్రా ధనరాజు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, అడ్డ బాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.


