సమన్వయంతో తుపాను ప్రభావాన్ని అడ్డుకున్నాం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఇటీవల మొంథా తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇరగవరం మండలంలోని 250 కుటుంబాలకు పది కిలోల బియ్యంతోపాటు నిత్యావసరాలను శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు. మొంథా తుపాను ప్రభావం ఉంటుందుని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రజలతోపాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. తుపాను కారణంగా తణుకు నియోజకవర్గంలో కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను విద్యుత్, ఫైర్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించారని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి శ్రేణులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link