భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు అన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం ) సమావేశం స్థానిక పార్వతి దేవి ఆలయ ప్రాంగణంలో య ర్రా మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఇటు వల మృతి చెందిన కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ చింతకాయల బాబురావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎర్ర జెండా ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా 1996లో సంక్షేమ బోర్డు సాధించుకున్నామని అయితే మన రాష్ట్రంలో 2009 సంవత్సరం నుండి మాత్రమే అమలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గడిచిన 2014 సంవత్సరం నుండి అధికారంలో ఉన్న టిడిపి. వైసిపి పాలక ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను ప్రభుత్వం తమ అవసరాల కోసం తరలించకపోయి సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులకు ఎటువంటి పథకాలు అమలు చేయకుండా మొండి చెయ్యి చూపడం పట్ల వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్న లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును పునర్ధరిస్తామని ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు ఇచ్చిన వారు అధికారంలోకి రాగానే దాని గురించి మాట్లాడక పోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాల అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం యూనియన్ 14 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బళ్ళ చిన వీరభద్రరావు. అధ్యక్షులుగా వాటాల నాగేశ్వరరావు. ఉపాధ్యక్షులుగా సోరపల్లి రామకృష్ణ, కార్యదర్శిగా అల్లాడి నాగ బలరాం, సహాయ కార్యదర్శిగా లంకే దుర్గారావు, కోశాధికారిగా బొక్క బాలాజీ రావు, సభ్యులుగా యర్రా మల్లికార్జునరావు, ఆనందం గంగాధర్ రావు, తిరునాథం వెంకటేశ్వరరావు, యాతం పెద్దరాజు, తాళ్ల సత్యనారాయణ, వాసా వెంకట సుబ్బారావు, దొంతంశెట్టి ముకుంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


