రాజ గోపాల్ సేవలు చిరస్మరణీయం : ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి.నారాయణ

తణుకు, అక్టోబర్ 30, 2025 : ఉత్తమ ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా, ఏపీటీఎఫ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యదర్శిగా అయినపర్తి రాజగోపాల్ చేసిన సేవలు చిరస్మరణీయం అని ఏపీటీఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి బి.వి.నారాయణ అన్నారు.

గురువారం మధ్యాహ్నం తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో రాజ గోపాల్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన రాజ గోపాల్ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు సంతాప సభకు పశ్చిమ గోదావరి జిల్లా శాఖ గౌరవాధ్యక్షులు పి.యన్.వి. ప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఈ సంతాప సభలో పలువురు నాయకులు అయినపర్తి రాజగోపాల్ విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఉపాధ్యాయ సంక్షేమానికి, ఉపాధ్యాయ ఉద్యమానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.

ముందుగా అయినపర్తి రాజగోపాల్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నాయకులందరూ పుష్పాంజలి ఘటించారు.

సభా వేదికపై ఇరగవరం ఎంఈవో ఎస్.శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి.నారాయణ, కార్యదర్శి వేండ్ర రామ్ మోహన్, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సువర్ణరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కండిబోయిన రాంబాబు, ఎస్.టీ.ఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.వి.జాకబ్ బాబు, పూర్వ రాష్ట్ర కౌన్సిలర్ కోట రామ ప్రసాద్ ఆశీనులయ్యారు.

సభా వేదిక పై ఉన్నవారితో బాటు ఎస్.టీ.యూ. జిల్లా కార్యదర్శి వి.ఉదయ కుమార్, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు లంక రాజు, రాజగోపాల్ రెండవ అల్లుడు పెనుగొండ రత్న కుమార్ ప్రభృతులు రాజా గోపాల్ సేవలను కొనియాడారు.

ఈ సభలో ఏపీటీఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఉపాధ్యక్షులు అల్లం వీరభద్ర రావు, పూర్వ రాష్ట్ర కౌన్సిలర్ కె.త్రిమూర్తులు, నాయకులు ఖండవల్లి రాజశేఖర్, పి.నవరత్న కుమారి, యన్.వి.వి.చౌదరి, ఎస్. జాన్సన్, యన్.జయరాజు, బి.శ్రీరామచంద్ర మూర్తి, ఏ.రాజ బాబు, ప్రభృతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంతాపసభ ఏర్పాటులో విశేష కృషి చేసిన వేండ్ర రామ్ మోహన్ ను ఏపీటీఎఫ్ నాయకులు అభినందించారు.

Scroll to Top
Share via
Copy link