ఎడ్యుఐకాన్ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది – రూట్స్ స్కూల్ డైరెక్టర్ బి. విద్యాకాంత్

మూడు దశాబ్దాలుగా రూట్స్ స్కూల్ ఆఫ్  ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ డైరెక్టర్ బి. విద్యాకాంత్ విద్యా రంగానికి చేసిన అత్యుత్తమ కృషికి గాను మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్  డెవలప్ మెంట్  సంస్థ  ఎడ్యు ఐకాన్ అవార్డుతో సత్కరించారు.

విశాఖపట్నంలో ఫెయిర్ ఫీల్డ్ మారియట్ హోటల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన ఎడ్యు ఐకాన్ 2025 అవార్డును గౌరవనీయులైన ఎంపీ శ్రీ భరత్,  ఎన్.ఐ.ఎస్.ఏ. అధ్యక్షులు శ్రీ కుల భూషణ్ శర్మ,  అపుస్మా అధ్యక్షులు  తులసి విష్ణు ప్రసాద్,  ట్రెస్మా అధ్యక్షులు  ఎస్ మధుసూదన్ రావు చేతుల మీదగా   బి. విద్యా కాంత్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆవార్డ్ తన భాద్యతను మరింత పెంచిందని, విద్యారంగంలో విలువలతో కూడిన విద్యావ్యాప్తికి కృషి చేస్తానని అన్నారు.

ఈ సందర్భంగా బి. విద్యా కాంత్ ను రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ డైరెక్టర్స్ ఎన్ .సుధాకర్ వర్మ , ఎల్. కె. త్రిపాఠి , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link