ఇరగవరం మండలం పరిషత్ అభివృద్ది అధికారి కార్యాలయంలో బుధవారం తణుకు, అత్తిలి, పెనుమంట్ర మండలములకు సంబందించిన ఉపాధి హామీ మండల సిబ్బందికి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ లకు సమీక్ష సమావేశము జరిగినది. ఈ సమావేశములో క్లస్టర్ స్దాయిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. వి. కె మల్లికార్జునరావు ఆధ్యక్షతన తణుకు క్లస్టర్ సమీక్ష సమావేశము ఇరగవరం మండలంలో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశము నందు ఉపాది శ్రామికుల యొక్క ఈ కేవైసి ప్రోగ్రెస్ పంచాయతీల వారీగా రివ్యూ చేసి ప్రోగ్రెస్ పెంచాలని ఆదేశించారు, కాంపొసిట్ పిట్స్ ప్రోగ్రెస్ పంచాయతీల వారీగా రివ్యూ చేసి కంప్లీట్ స్టేటస్ లో పెట్టాలని ఆదేశించారు, ఫైనల్ గ్రామ సభ & పి.ఆర్.ఏ. మ్యాపింగ్ అప్లోడ్ పై రివ్యూ చేసియున్నారు. అదేవిదంగా కాటిల్ షెడ్స్ నిర్మాణం 1.0 & 2.0 ల పై సమీక్ష నిర్వహించి ఆమోదం పొందిన కాటిల్ షెడ్స్ లు నిర్మాణం సకాలంలో పూర్తి చేసేవిధముగా చర్యలు తీసుకోవాలని 4 మండలాల సిబ్బందికి ఆదేశించారు. సదరు కార్యక్రమమునకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు, తణుకు క్లస్టర్ అధికారులు, నాలుగు మండలాల ఉపాధిహామీ పదక సిబ్బంది, గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ లు హాజరయ్యారు


