తండ్రి, తనయుల పర్యటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు

— చంద్రబాబు, లోకేష్‌ విదేశీ పర్యటనలతో రాష్ట్ర అభివృద్ధి

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు :  

ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరో పక్క రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు దుబాయి పర్యటనలో లోకేష్‌ ఆస్ట్రేలియా పర్యటనలతో తండ్రి, తనయుల కృషితో ఏపీ ప్రభుత్వం, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆయా దేశాల్లో ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించడంతో  వీరి పర్యటనకు ప్రాధాన్యత చేకూరుతోందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఇప్పటికే సింగపూర్‌లో పర్యటించారని గుర్తు చేశారు. మరోసారి దుబాయి, ఆస్ట్రేలియా పర్యటనలతో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.

Scroll to Top
Share via
Copy link