యువజన ఉత్సవాలలో సత్తా చాటిన ఎస్ కె ఎస్ డి మహిళా కళాశాల విద్యార్థినులు

యువజన సర్వీసుల శాఖ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన జిల్లా యువజన ఉత్సవాలలో తణుకు ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాల ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో రాణించారని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. అక్టోబర్ 17వ తేదీన ఎస్కే ఎస్డి కళాశాల ఆవరణలో నిర్వహించిన యువజన ఉత్సవాల్లో వెస్ట్రన్ గ్రూప్ డాన్స్ లో పి.నందిని, కే.స్నేహ, డి. వర్షిని, ఆర్. వర్షా, ఎస్ భారతి, డి. అమూల్య ఎం. ఐశ్వర్యలు పాల్గొని ప్రథమ స్థానాన్ని సాధించారని ఫోక్ డాన్స్ లో ఏ.శ్రావణి ద్వితీయ స్థానాన్ని కూచిపూడి క్లాసికల్ లో యు. యామిని తృతీయ స్థానాన్ని వక్తృత్వంలో డి. తేజ తృతీయ స్థానాన్ని సాధించి బహుమతులు అందుకున్నారని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి అభినందించారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ కమిటీ నిర్వాహకులు ఎస్ గృహలక్ష్మి, ఆర్. సుధారాణి, టి.లక్ష్మి కుమారి , అధ్యాపకులు , అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link