మండల న్యాయసేవలకమిటీ ద్వారా ఉచిత న్యాయసహాయం

ఉమ్మడి గోదావరి జిల్లాల న్యాయసేవల సంస్థ సెక్రటరీ కే. రత్న ప్రసాద్ శనివారం తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా ముద్దాయిల కేసు వివరములు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయసేవలకమిటీ తణుకు వారి ద్వారా ఉచిత న్యాయ సహాయం సేవలు అందిస్తారని, ప్రతి ఒక్కరూ న్యాయవాదిని కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి వారానికి రెండు రోజులు ప్యానెల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్ లు వచ్చి న్యాయ సలహాలు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు జైలు సూపరింటెండెంట్ జి. మోహనరావు, ప్యానెల్ న్యాయవాదులు శ్రీమతి డి. కృష్ణకుమారి, శ్రీమతి ఎం. శ్రీదేవి పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link