కాలుష్యం తగ్గించడానికి ప్రతిఒక్కరు ఇంటికో మొక్క నాటాలని – మండల తహశీల్దార్ పి.ఎన్.డి.ప్రసాద్

వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రతిఒక్కరు ఇంటికో మొక్క నాటాలని మండల తహశీల్దార్ పి.ఎన్.డి.ప్రసాద్ తెలియజేశారు. శనివారం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర కార్యక్రమంలో వాయి కాలుష్యంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గాలి నీరు మానవ మనుగడలో ప్రధాన భాగామని వాటిని కాపాడుకోవడం మానవ కర్తవ్యం అని, ప్రస్తుత సమాజంలో పర్యావరణానికి హాని కలిగించే రీతిలో నీటిని గాలినే వివిధ రకాలుగా కలుషితం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కాల్చడం ద్వారా వచ్చే కాలుష్యం ఫ్యాక్టరీ పొగ ద్వారా వచ్చే కాలుష్యం వివిధ రసాయనాలు కాల్చడం ద్వారా వచ్చే పొగ ద్వారా గాలికలుషితం అయ్యి మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అన్నారు. తద్వారా ఊపిరి తిత్తులు, గుండె, సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి ప్రాణాoతక వ్యాధులు వచ్చి మానవ మనుగడ ప్రమాద స్థాయిలో ఉంటుందని దీనిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు వాయు కాలుష్యం అరికట్టడానికి చెట్లను నాటి పరిశుభ్రతను పాటించి తడి పొడి చెత్తను పంచాయతీ రిక్షాలకు అందించి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యకరమైన సమాజ శ్రేయస్సుకే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీఓ M.శ్రీనివాస్ తెలియజేసారు. సర్పంచ్ చీపుళ్ల కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి ఆంజనేయ శర్మ, మండల పారిశుధ్య సమన్వయకర్త కత్తుల ప్రకాష్, ఏ.పి.ఎం. బాల కోటయ్య, ఏ.ఇ. హోసింగ్ ఏడుకొండలు, అగ్రికల్చరల్ అధికారి గ్రామ నాయకులు, కార్యదర్శి వి. శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link