ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం లక్ష్యం
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో అంధత్వాన్ని నివారించవచ్చని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇందుకోసం తణుకు నియోజకవర్గంలోని ప్రజలకు కంటి పరిక్షలు నిర్వహించి తద్వారా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో శనివారం తణుకు వేల్పూరు రోడ్డులోని వీకే ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరికి అండగా నిలబడాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తణుకు నియోజకవర్గంలో అంధత్వ నివారణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, దేశప్రధాని నరేంద్రమోదీ, మంత్రి నారా లోకేష్ సంయక్తంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి వైద్య సహాయం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలు బీమా సదుపాకం కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా అర్హులైన ప్రతిఒక్కరికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అంధత్వ నివారణకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కంటి చూపు సమస్యలు లేకుండా ముందుగానే పరీక్షలు చేసి అంధత్వాన్ని నివారించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భవిష్యత్తులో కంటి చూపు సమస్యలు లేకుండా ఉండేందుకు ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయడ జరుగుతోందని చెప్పారు. అనంతరం అవసరమైన వారికి రీడింగ్ అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ ఆసుపత్రి, అలంపురం వెంకటరమణ ట్రస్టుతోపాటు ఏలూరు నుంచి వచ్చిన వైద్యులు వీణా, మహాలక్ష్మి, స్మృతి, రేఖాకీర్తి, సౌజన్య, చందన ప్రియాంక, రషీద్, హుస్సేన్, ఆదిత్యరెడ్డి, లక్ష్మి సరోజు, జాన్సీరాణి, ఇతర వైద్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


