జూట్ బ్యాగ్ లు, కుట్టు తయారీ శిక్షణా తరగతులకు నిరుద్యోగ మహిళలకు ఆహ్వానం
అక్టోబర్ 23న నిడదవోలులోని మంత్రి కందుల దుర్గేష్ క్యాంపు కార్యాలయంలో అవగాహన సదస్సు
యూనియన్ బ్యాంక్ సహకారంతో త్వరలోనే నిష్ణాతులైన శిక్షకుల నేతృత్వంలో జ్యూట్ బ్యాగ్, కుట్టు తయారీలో ఔత్సాహిక మహిళలకు శిక్షణ
శిక్షణా కాలంలో ఉచిత భోజన సౌకర్యం సదుపాయం
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఔత్సాహిక మహిళలకు మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయం సూచన
నిడదవోలు నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పన, ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అక్టోబర్ 23న నిడదవోలులోని మంత్రి కందుల దుర్గేష్ క్యాంపు కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ సహకారంతో జ్యూట్ బ్యాగ్, కుట్టు తయారీలో శిక్షణ ఇచ్చే అంశంపై అవగాహన సదస్సు ఉంటుందని శనివారం మంత్రి దుర్గేష్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. నిష్ణాతులైన శిక్షకులచే క్యాంపు కార్యాలయంలోని మొదటి అంతస్థులో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, శిక్షణా కాలంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. శిక్షణలో భాగంగా మహిళలకు యూనిఫామ్స్, కిట్ అందిస్తామని వెల్లడించింది. ఔత్సాహిక మహిళలు అవగాహన సదస్సుకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం 9347651157, 98481 66644 నంబర్ లను సంప్రదించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ తీసుకురావాలని పేర్కొంది.


