ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులకు గ్రామ సర్పంచులకు, మండల అధికారులకు, సచివాలయ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వసభ్య సమావేశానికి తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు హాజరై మండలంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సంబంధిత శాఖల అధికారుల నుండి పనుల పురోగతి తెలుసుకోవాలని అన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ శాఖల యందు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు సంబంధించిన వివరాలు హాజరైన సభ్యులకు తెలియజేశారు. సదరు సమావేశంలో సభ్యులు అడిగిన సందేహాలకు సంబంధిత శాఖల వారీగా అధికారులు వివిధ రకాల అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలు గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు గ్రామపంచాయతీ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


