ఇరగవరం జిల్లా పరిషత్ హైస్కూల్ యందు బుధవారం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలబాలికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 15వ తేదీ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే గా జరుపుకుంటారని మన చేతులు మన భవిష్యత్ అనే నినాదంతో చేతులను ఏ విధంగా శుభ్రపరుచుకోవాలో ఆ విధంగా చేయడం వలన జరిగే ఉపయోగాలను తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణలో మన దైనందిని జీవితంలో చేతుల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని సరియైన విధంగా చేతుల పరిశుభ్రత పాటించరచో చాలా రకాల వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండలస్థాయి అధికారులు, పంచాయితీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


