సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం భారత దేశ ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నిరంతర బోధకుడు, సాధకుడు పేపర్ బాయ్ నుండి మిస్సైల్ మేన్ వరకు ఎదిగిన ఎవరెస్టు శిఖరం అబ్దుల్ కలాం అని అన్నారు. జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండారు వాయునందన రావు మాట్లాడుతూ శాఖాహారి ఆజన్మ బ్రహ్మచారి ప్రజల రాష్ట్రపతిగా పేరు గడించిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించగా పలువురు వక్తలు ఆయన జీవిత చరిత్ర విశేషాలను వివరించారు. అనంతరం ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండారు వాయునందనరావును సీనియర్ అద్యాపకులు మహమ్మద్ గౌస్ మహుద్దీన్ లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పెనుమాల జగన్మోహనరావు, బోయి లక్ష్మణరెడ్డి, పి. సూర్యారావు, ఎం కృష్ణ కిషోర్, అధ్యాపకురాలు నక్కా సుజాత, రుద్రరాజు పీఎస్ లక్ష్మి ఓలేటి కృష్ణ గీతార్జున, ఎస్ బి బి లక్ష్మీ భారతి, ముక్కామల మోహనరావు బర్రె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


