శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో నడుముకు ఆపరేషన్ చేయించుకున్న మహిళకు వైద్య నిమిత్తం పదివేల రూపాయలు, కుక్కకాటుకు గురైన తొమ్మిది సంవత్సరాలు బాలునకు వైద్య నిమిత్తం 2000 రూపాయలు ఒక చిరు వ్యాపారస్తునికి నీడనిచ్చే గొడుగును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పూర్వపు గవర్నర్ దామర రంగారావు విచ్చేసి నిరంతరం సమాజానికి సేవలు అందిస్తున్న వావిలాల సరళాదేవి రమేష్ దంపతులను అభినందిస్తూ తనదైన శైలిలో చక్కని సేవలతో ముందుకు కొనసాగుతున్న తారకపురి ప్రెసిడెంట్ పవన్ కుమార్ సెక్రెటరీ రామకుమార్ ట్రెజరర్ గోపికృష్ణలను ప్రత్యేకించి అభినందించారు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ లైనిజం నిలబడి వారి కష్టాలు ఆదుకునే ఆపద్బాంధవులు లైన్స్ సభ్యులని ఈ విధంగా లైన్స్ సేవలో ఉన్న ప్రతి లైన్స్ సమాజానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ సభ్యులు ఆకురాతి శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, వి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


