తీరుగూడెంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు : రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలపై, రాష్ట్రంపై ఉండాలని, ద్వారా వెలుగులు ప్రసరించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు వారి వారి రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం పరంగా చేయాల్సిన కార్యక్రమాలను చేసేందుకు కృషి చేస్తామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తీరుగూడెంలో మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు.




