జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలు, నూతన మార్పులను ప్రజలకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమం నిర్వహించిన మంత్రి దుర్గేష్
ప్రధాని మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సాధారణ, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, దాదాపు ప్రతి కుటుంబానికి రూ. 15, 000 ఆదా అవుతుందని తెలిపిన మంత్రి దుర్గేష్
జీఎస్టీ సంస్కరణల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్
ఈ సందర్భంగా ఇంటింటికి జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లాభాలను తెలుపుతూ ప్రచురించిన కరపత్రాలను అందించిన మంత్రి కందుల దుర్గేష్, కూటమి నాయకులు
నిడదవోలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని తద్వారా దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరుగి మార్కెట్లో కొత్త పరిశ్రమల రాకకు, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి దోహదం చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని తీరుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. జీఎస్టీ 2.0 వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలపై ఇంటింటా ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఇంటింటికి జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లాభాలను తెలుపుతూ ప్రచురించిన కరపత్రాలను కూటమి నాయకులతో కలిసి అందించారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. అనంతరం మీడియాతో మంత్రి కందుల దుర్గేష్ జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జీఎస్టీ 5 నుండి 18 శాతం మాత్రమే ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రశంసించారు. 18 శాతానికి మించి జీఎస్టీ ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి కుటుంబానికి దాదాపు రూ. 15 వేల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల నిత్యావసర వస్తువుల మీద, టీవీ, సబ్బులు తదితర వస్తువుల మీద జీఎస్టీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని పెంచి, వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి, పన్నుల విధానంలో పారదర్శకతను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ప్రత్యేక నిర్ణయంతో మాత్రమే వస్తువుల ధరలు తగ్గుతున్నాయని ప్రజలు గమనించాలన్నారు. జీఎస్టీ సంస్కరణల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం అవసరమైన సమయంలో అవసరమైన మార్పులు తీసుకొస్తూ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుభిక్షమైన పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రజలను కోరారు.
తొలుత తీరు గూడెం చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ స్థానికంగా ఉన్న దివంగత ఎన్టీఆర్, డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నమస్కరించారు. అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలు విన్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


