వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్ పేరుతో అవగాహన
జీఎస్టీ 2.0 సంస్కరణలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం అత్తిలి మండలంలో సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్ పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సు, ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, జీవన పథకాలు తదితర వస్తువులపై జిఎస్టి లో వచ్చిన మార్పుల కారణంగా రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. గతంలో 12 శాతం ఉన్న జీఎస్టీను ఐదు శాతానికి తగ్గించడం వల్ల యాంత్రికరణ పరికరాలపై రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో భవిష్యత్తులో సైతం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


