ఆన్లైన్ అర్జీలు నమోదు – meekosam.ap.gov.in / సమాచారం కోసం 1100
జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, డివిజన్, మండల స్థాయిల్లో “మీకోసం కార్యక్రమం” (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) సోమవారం, 29 సెప్టెంబర్ 2025న నిర్వహించబడుతుంది.
జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఆదివారం ప్రకటిస్తూ, ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే నమోదు చేసిన అర్జీల స్థితి లేదా సంబంధిత వివరాల కోసం 1100 నంబరుకు కాల్ చేయవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా అర్జీ స్వీకరణ కోసం రాతసహాయకులు, రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, జిల్లా, మున్సిపల్, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా) పేర్కొన్నారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, తాగునీటి వంటి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పిజిఆర్ఎస్ (ప్రజా గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్) విజయవంతం చేయాలన్నారు.
జిల్లా మీకోసం నోడల్ అధికారి & జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


