ఉండ్రాజవరం మండలం వేలివెన్ను ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల పసలపూడి HWC సెంటర్ నందు స్వస్థ్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళ -శక్తివంతమైన కుటుంబం)కార్యక్రమం చేయట్టడం జరిగినది. మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగు ఈ కార్యక్రమములో భాగంగా పసలపూడి ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ నందు dr.Y.సృజన అధ్యక్షతన క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. మహిళలను, కిషోర బాలికలను, గర్భవతులను, బాలింతలను ఉద్దేశించి మహిళలు ఆరోగ్యంగా వుంటే కుటుంబం ఆరోగ్యంగా వుంటుంది. తద్వారా సమాజము, రాష్ట్రము, కూడా అభివృద్ధి చెందుతుందని ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని మహిళలకి తెలిజేసినారు. మహిళలు గ్రామ పెద్దలు, ప్రజలు ప్రతిజ్ఞ చేయడం జరిగినది. మహిళలకు గుండెజబ్బులు, మదుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ గర్భాశయముఖద్వారా క్యాన్సర్, గూర్చి, బహిస్టు సమయంలో తీసుకోవలసిన పరిశుభ్రత గూర్చి తెలియజేస్తూ మహిళలను పరీక్షించడం జరిగినది. రక్తహీనత, సికిల్ సెల్స్, పోషక ఆహారం, నూనె, ఉప్పు, పంచదార తీసుకోవలసిన మోతాదు, గురించి అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో ఆరోగ్యసేవలను వినియోగించుకున్నారు.


