ఇరగవరం ప్రాడమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంను నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, కంటిపరీక్షలు, స్త్రీలకు కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్త పరీక్షలు, వృద్దులకు ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాది పరీక్షలు, సాదారణ అనారోగ్య రోగులను పరీక్షించి వైద్యులు రోగులకు వైద్య సేవలు అంధించిరి. ఈ కార్యక్రమంలో 110 మంది రోగులు వైద్య సేవలు పొందినారు .
ఈ కార్యక్రమంలో ఇరగవరం గ్రామ కూటమి నాయకులు శీలబోయిన శ్రీనివాస్, చవ్వకుల సత్యనారాయణ, కడలి పైలా రావు, మెరిపే రాజేశ్, వేండ్ర పోతురాజు, వీరవల్లి పాలేశ్వరరావు, గంధం నాగు, మంగం కృష్ణ, బొక్క రాంపండు, పంపన సుబ్బారావు, మల్లుల శ్రీను, పితాని రాముడు, వేండ్ర నాగు, తానేటి సుబ్రహ్మణ్యం, ఇరగవరం ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్: యార్లగడ్డ మౌనిక, CHO Sk.ఖాన్ సాహెబ్, సూపర్వైసర్లు మూర్తి, మంగతాయారు,MLHP లు ,ANM లు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఇతర ఆరోగ్య సిబ్బంది సచివాలయం కార్యదర్శి నరసింహా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .


