ప్రముఖ తెలుగు భాష కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు ఎస్ఎం స్కూలు నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ ప్రాధాన్యత ఇచ్చిన పాత్రికేయుడు దేశభక్తుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం అని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ గుంటూరు వెంకట చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుతనం మూర్తీభవించిన మహాకవి చిలకమర్తి అని అన్నారు. ఈ సందర్భంగా చిలకమర్తి జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించగా పలువురు వక్తలు ఆయన జీవిత విశేషాలపై మాట్లాడారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ ను, విశ్రాంత ఎన్టిపిసి డిప్యూటీ మేనేజర్ మందరపు సాయిబాబాను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేలపాటి చంటి, గోటేటి మారుతీ గోవిందరావు, మానవత వెంకటేశ్వరరావు, కామర్స్ పార్థసారథి, బర్రె శ్రీనివాస్, కే.రాంబాబు ఆలపాటి సుబ్బారావు, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, మహమ్మద్ వలి, బి.దుర్గాభాను, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


