రక్తదానం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు

బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

రక్తదానం ప్రాముఖ్యతను, ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకుని తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల పట్ల ఆయన పార్టీ నాయకులను అభినందించారు తణుకు పట్టణంలోని ముళ్ళపూడి హరిచంద్రప్రసాద్ రెడ్ క్రాస్ సొసైటీను గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీ కార్యకర్తలను మరింత వికృతం చేసినట్లు చెప్పారు. తణుకు పట్టణ బిజెపి అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు 56 పర్యాయాలు రక్తదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనియారు.
బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక, తణుకు పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link