ఒక దేశం – ఒకే ఎన్నిక విప్లవాత్మక సంస్కరణ..తద్వారా సమగ్రాభివృద్ధికి అవకాశం

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

రాజమండ్రిలో నిర్వహించిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరముందన్న మంత్రి దుర్గేష్

దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గి, రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుందన్న మంత్రి దుర్గేష్

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి చర్చ జరగాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్

జమిలీ ఎన్నికలు సహృద్భావ వాతావరణంలో జరగాల్సిన అవసరం ఉందన్న మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం: ఒక దేశం – ఒకే ఎన్నిక విప్లవాత్మక సంస్కరణ అని, తద్వారా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు తమ శక్తియుక్తులను కేంద్రీకరించి సమర్థవంతమైన ఎన్నికల విధానానికి నాంది పలికేందుకు అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని మంజీరా హోటల్ నందు ఆదివారం నిర్వహించిన ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గి, రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావడానికి వేదిక అవుతుందన్నారు. జమిలీ ఎన్నికలు సహృద్భావ వాతావరణంలో జరగాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా రాజకీయ చిత్తశుద్ధితో పాటు ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరాన్ని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఒత్తిడి ఉంటుందన్న విషయాన్ని మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరముందని తద్వారా సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని ఉద్ఘాటించారు.ఈ నేపథ్యంలో సంస్కరణలు ఆహ్వానించాలని, ప్రజలను జాగృతం చేసి అవగాహన కల్పించాలని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల జాతీయ, ప్రాంతీయ పార్టీల మనుగడకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న హామీని, నమ్మకాన్ని ఇవ్వగలగాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెన్నైలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని దానికి కట్టుబడి ఉన్నామన్నారు. అంతకుముందే పొలిటికల్, అడ్మినిస్ట్రేషన్ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్నికలు జరిగినప్పుడే ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతుండటం వల్ల ఇక్కడి ప్రజలకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయంలో పెద్ద తేడా ఏమీ కనిపించదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొద్దిగా మార్పు కనిపించే అవకాశం ఉందన్నారు. 2004 నుండి 2024 వరకు రాష్ట్రంలో జమిలీ ఎన్నికలనే చూస్తున్నామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఆలోచన సరళి పెరిగిన నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చర్చనీయాంశం అయిందన్నారు. తద్వారా సత్ఫలితాలు ఉన్నాయన్నారు. సరైన రాజకీయ పరిపాలన సంస్కరణలు తీసుకురాకపోతే దుష్పలితాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.భారతదేశంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం క్రమంగా తగ్గిపోతుందన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం పెరగడంతో ఈ విధానం ద్వారా వాటిని చిన్నచూపు చూస్తారన్న భావన పెరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఓటరు మనోగతం ఏ విధంగా ఉంటుందో మంత్రి దుర్గేష్ విశ్లేషించారు. జమిలీ ఎన్నిక జరిగితే ప్రాంతీయ సమస్యలను పట్టించుకోరన్న భావన ప్రజల్లో నెలకొనే అవకాశం ఉందన్నారు.జమిలీ ఎన్నికలు సహృద్భావ వాతావరణంలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ సంస్కరణలతో పాటు కార్వనిర్వాహక సంస్కరణలు తీసుకురావాలి అన్నారు. సరైన సంస్కరణలు తీసుకురాకపోతే ఈ అంశం బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందన్నారు.

కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీ, న్యూఢిల్లీ ఎంపీ బాన్సూరి స్వరాజ్, శాసనమండలి సభ్యులు సోమువీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే అనమిల్లి రామకృష్ణారెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రోగ్రాం ఏపీ కన్వీనర్ సూర్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర , వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link