అభినందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరిని సత్కరించిన ఎమ్మెల్యే
సంగీత దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు పాన్ ఇండియాలో ఘన విజయం సాధించి పెట్టిన సంగీత దర్శకుడు గౌర హరి తణుకు ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జై హనుమాన్, మిరాయ్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన తణుకు పట్టణానికి చెందిన గౌర హరి ఆదివారం తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. తణుకులో విద్యాభ్యాసం చేసిన సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న గౌరహరి భవిష్యత్తులో మరిన్ని విజయవంతమై చిత్రాలు అందించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఉత్తమ సంగీత దర్శకుల జాబితాలో ఆయన పేరు సాధించాలని కోరారు. అనంతరం మిరాయ్ చిత్రం ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్ వద్ద నిర్వహించిన సంబరాల్లో పాల్గొని ప్రేక్షకులు, గౌరహరితో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


