ఏపీ పర్యాటక, అతిథ్య రంగంలో పెట్టుబడులకి ఆహ్వానం – మంత్రి కందుల దుర్గేష్

బెంగుళూరులోని సెప్టెంబర్ 18-20 వరకు జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) 55వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, ఐఏఎస్

రాష్ట్ర పర్యాటక ఆతిధ్య రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించిన మంత్రి దుర్గేష్

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి.. భరోసా కల్పించే బాధ్యత మాది అని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్

హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని వెల్లడి

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని రావాలని ఆహ్వానం

అమరావతి/ బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక, ఆతిథ్య రంగాలకు స్వర్గధామం అని, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లకు స్పష్టం చేశారు. బెంగుళూరులోని హోటల్ కాన్రాడ్ లో సెప్టెంబర్ 18-20 వరకు జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) 55వ వార్షికోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, ఐఏఎస్, నోడల్ ఆఫీసర్(పెట్టుబడులు) సత్యప్రభలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో సుస్థిర పర్యాటక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, నూతన పర్యాటక పాలసీ 2024-29, ఏపీ పర్యాటకానికి పారిశ్రామిక హోదా, పర్యాటక రంగంలో పెట్టుబడుల అవకాశాలను ఏపీ బృందం వివరించింది.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 55వేల గదుల ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. విభిన్న పర్యాటక ప్రక్రియల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అణువైన ప్రాంతమని పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీని పర్యాటకుల ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకి భరోసా ఇచ్చే బాధ్యత తమది అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. అనంతరం ఏపీలో పర్యాటక పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా హిల్టన్, తమరా లెజర్, ది పోస్ట్కార్డ్ హోటల్, రాడిసన్, సీషెల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, మారియట్ ఇంటర్నేషనల్, అట్మాస్పియర్ కోర్, స్టెర్లింగ్ హాస్పిటాలిటీ, క్లార్క్స్ ఎక్సోటికా, వైస్రాయ్, వండర్లా అమ్యూజ్మెంట్ పార్కులు, జీఆర్టీ హోటల్స్, పాపీ హోటల్స్, ప్రమోద్ గ్రూప్ మరియు రామాడా వంటి 40 మంది ప్రముఖ హోటల్ & హాస్పిటాలిటీ, రిసార్ట్లు, అమ్యూజ్మెంట్ పార్కుల ప్రతినిధులను ఆహ్వానించారు. అంతేగాక నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సీఎక్స్వో లను రావాలని ఆహ్వానించారు.

Scroll to Top
Share via
Copy link